Wednesday, August 27, 2014

రాజధాని ఎక్కడ కావాలి అంటే


ఎప్పుడు వరదలోస్తాయో , ఎప్పుడు కొట్టుకు పోతామో అని అనుక్షణం కుక్కలా బ్రతికే ఇరుకు చోటు అయి వుండాలి

భూకంపాల జోన్ అయి వుండాలి . ఎప్పుడొచ్చినా చావడానికి రెడీగా వుండే ప్రాంతం అయి వుండాలి

కుక్క కూడా **చ్చ పోసుకోడానికి కూడా చోటులేనంత గా చుట్టూ మన ఇలాకా వాల్లే వుండాలి

ఇంటి పాలేరును పంపినా మన పనులు జరిగేటుగా వుండాలి

కాపలా వుండే గార్డు ను పంపినా ప్రజలు బయపడే లా వుండాలి

మా కులపోళ్లు లేని ప్రాంతం అయితే చచ్చినా ఒప్పుకొనేది లేదు

వోట్లన్ని మాకే పదేట్లున్డాలి

ఏ విషపు రాతలు రాసి వడ్డించినా కొనుక్కొని చదివి నమ్మే ప్రజానీకం వుండాలి

ఎన్ని దొంగ జి వో లు ఇచ్హినా , కబ్జా చేసుకున్నా , నోరు మూసుకొని వుండే మన కులనాడు అయి వుండాలి

మేము తయారు చేసే పవర్ ను ఎక్కువగా వాడే ఏరియానే అయి వుండాలి .. దానినే రాజధాని చెయ్యాలి

 ----------------

ఇంతేనా ఇంకా ఏమైనా ఉన్నాయా ?



Tuesday, June 17, 2014

గుదిబండగా మారిన 370వ అధికరణ

గుదిబండగా మారిన 370వ అధికరణ - గౌతం ముఖర్జీ

నూతన ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయంలో సహాయమంత్రి జితేం ద్ర సింగ్ గత మే 28న ఒక ప్రకటన చేస్తూ, జమ్ము-కాశ్మీర్‌కు అనువర్తింప జేస్తున్న 370వ అధికరణంపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలివుందని పేర్కొనడంపై వివాదం చెలరేగింది. నిజానికి ఈ అధికరణాన్ని ఎత్తివేయాలని భారతీయ జనతాపార్టీ (్భజపా)ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్న మాట వాస్తవం. దీనిపై దేశవ్యాప్తంగా వెల్లడైన అభిప్రాయాల మాట అట్లా ఉంచితే, ఈ అధికరణంలో మార్పు చేయడానికి అవసరమైన బలం ప్రస్తుత భాజపా ప్రభుత్వానికి ఉన్నదా? అన్న ప్రశ్న సహేతుకమైంది. ఎందుకంటే 370 అధికరణాన్ని ఎత్తివేయడం వల్ల జమ్ము-కాశ్మీర్‌కు ఇప్పటివరకు కల్పిస్తున్న ప్రత్యేక ప్రతిపత్తి తొలగిపోతుంది. మరిది సాధ్యం కావాలంటే పార్లమెంటులో సరికొత్త తీర్మానంపై ఓటింగ్ జరపడం, లేదా రాజ్యాంగ సవరణ అవసరం. అందుకోసం ప్రస్తుత లోక్‌సభలో భాజపా నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వానికి 362 (మొత్తం లోక్‌సభ సభ్యుల సంఖ్య 543) మంది సభ్యుల మద్దతు అవసరం. ఒకవేళ అటువంటి తీర్మానం ప్రవేశపెట్టినట్టయితే ఎన్‌డిఎ ప్రభుత్వానికి అవసరమైన మెజారిటీ సాధనకు మరో 30 మంది సభ్యుల మద్దతు అవసరవౌతుంది.

మరి తరచి చూస్తే ఈ సభ్యుల మద్దతు పొందడం ప్రస్తుత లోక్‌సభలో పెద్ద సమస్య కాకపోవచ్చు. జాగ్రత్తగా వ్యూహాత్మక వైఖరితో ముందుకెళితే పెద్ద కష్టం కాబోదు. ఎట్లా అంటే... తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ల మద్దతు పొందగలిగితే తీర్మానం గట్టెక్కడం ఖాయం. వీరి మద్దతు పొంద గలిగితే బిల్లుపై చర్చ జరిగిన తర్వాత నిర్వహించే ఓటింగ్‌లో ప్రభుత్వం గెలుపు సాధించడం పెద్ద కష్టమేం కాదు. ఒకవేళ పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని నిర్వహించినా, లోక్‌సభలో 2/3వ వంతు మెజారిటీ (్ఫ్లర్ మేనేజ్‌మెంట్ ద్వారా) ఉన్నది కనుక, అక్కడ కూడా తీర్మానానికి మెజారిటీ సభ్యుల మద్దతు లభించగలదు.

జమ్ము-కాశ్మీర్ నుంచి కూడ ఒక ఆమోదం దానికదే లభించడానికి కూడ ఎన్నో మార్గాలున్నాయి. జమ్ము-కాశ్మీర్ అసెంబ్లీ అభిప్రాయంతో పాటు, రాష్ట్ర ప్రజల అభిప్రాయాన్ని కూడా తీసుకోవాలి. ఈ విషయంలో జమ్ము-లడఖ్ ప్రాంతాల అభిప్రాయాలకు అత్యధిక ప్రాధాన్యతనివ్వాలి. ఈ ప్రాంతాల ప్రజలు మొత్తం మానవ జనాభా పరంగా సమూలమైన మార్పును కోరుతున్నారు. అధిక సంఖ్యలో భారతీయులు జమ్ము-కాశ్మీర్‌లో ఆస్తులు కొనుగోలు చేసి వ్యాపారాలు చేసుకోవాలని, పెట్టుబడులు స్వేచ్ఛగా తీసుకొని రావాలని కోరుతున్నారు. మరి వీరి కోర్కె నెరవేరాలంటే 370 అధికరణం అమల్లో ఉన్నంతకాలం సాధ్యం కాదు. అయితే స్థానికంగా ఎవరైనా జవాబుదారీగా ఉండటానికి ముందుకు వచ్చినా వీరి కోర్కె తీరడానికి ఏవిధమైన అడ్డంకులు ఉండబోవు. ఎన్నో దశాబ్దాలుగా రాష్ట్ర ప్రభుత్వం పుణ్యమాని చాలా తక్కువ అభివృద్ధి మాత్రమే చోటు చేసుకున్నదని, ఈ ప్రాంత (జమ్ము- లడఖ్) ప్రజలు గట్టిగా విశ్వసిస్తున్నారు. సుదీర్ఘకాలం పాటు తమపట్ల ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్య వైఖరి అవలంభించిందన్న అభిప్రాయం ఈ ప్రాంత వాసుల్లో బలంగా ఉంది. కాశ్మీర్ లోయ ప్రాంతానికి చెందిన కాశ్మీరీ పండిట్లు దాదాపుగా తమ స్వస్థలం నుంచి బహిష్కరణకు గురయ్యారు. స్వదేశంలోనే కాందిశీకులుగా జీవనం వెళ్ళదీసే దుస్థితికి వారిలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. వారి ఆస్తులను దారుణంగా దోచుకున్నారు. నిలువనీడలేని వారి దుస్థితికి ఎవరిని ప్రశ్నించాలి?

కాశ్మీర్ లోయనుంచి పండిట్లను సమూలంగా వెళ్ళగొట్టడం, పెద్ద నేరం మాత్రమే కాదు, తీవ్రస్థాయి మానవ హక్కుల ఉల్లంఘన కూడ. రాజ్యాంగ విరుద్ధంగా జమ్ము- కాశ్మీర్‌లోని మెజారిటీ ప్రజలు పాల్పడిన ఈ అనైతిక దుశ్చర్యను నిరోధించడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. అంతేకాదు దారుణంగా రాష్ట్రంనుంచి వెలివేతకు గురైన కాశ్మీరీ పండిట్లను తిరిగి వారి స్వస్థలాలకు రప్పించి, తగిన నష్టపరిహారం ఇప్పించడమే కాకుండా రక్షణ కల్పించాల్సిన తన బాధ్యతను కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా విస్మరించింది. ఇంతటి దారుణ దుశ్చర్యకు పాల్పడిన జమ్ము-కాశ్మీర్ ప్రభుత్వం మరియు ఆ రాష్ట్ర ప్రజలు ప్రస్తుతం మనుగడ సాగిస్తున్నది కేవలం కేంద్ర ప్రభుత్వం సమకూర్చే నిధుల సాయంతోనే! పర్యాటక రంగం, ఇతర కుటీర పరిశ్రమలనుంచి వస్తున్న అతి స్వల్ప ఆదాయంతో రాష్ట్ర ప్రభుత్వ మనుగడ సాగించడం చాలా కష్టం.

అసాధారణ రీతిలో కాశ్మీర్ లోయనుంచి ఎప్పటికప్పుడు పుట్టుకొస్తున్న దారుణమైన ముళ్ళ వెనుక అసలు నిజం ఎల్లవేళలా తెరమరుగున ఉండిపోతున్నది. పరిస్థితిని పరిశీలిస్తే, జమ్ము-కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370వ అధికరణం వల్ల లబ్ది పొందుతున్నది కేవలం నేషనల్ కాన్ఫరెన్స్‌కు నేతృత్వం వహిస్తున్న అబ్దుల్లా మరియి ప్రతిపక్షమైన పిడిపి అధినేత ముఫ్తీమహమ్మద్ సరుూద్ కుటుంబాలు మాత్రమేనని పరిస్థితిని పరిశీలిస్తే అనుమానం రాకమానదు. ఎందుకంటే అక్కడ ‘క్యాబోట్లు’, ‘లాడ్జ్‌లు’, అన్నింటా వారిదే ఏకస్వామ్యం కొనసాగుతోంది. జమ్ము-కాశ్మీర్‌లో ఏ వ్యాపారానికైనా తామే హక్కుదార్లమన్న అహంకారం వారి దౌర్జన్యకాండలో కనిపిస్తుంది. ముఖ్యంగా 370వ అధికరణంపై చర్చ అనగానే క్షణం ఆలస్యం చేయకుండా తీవ్రస్థాయిలో స్పందించిన తీరును చూస్తుంటే, ఈ అధికరణం వారికి కల్పతరువుగా మారిందన్న సత్యం బోధపడుతుంది.

2014 సాధారణ ఎన్నికల్లో జమ్ము-లఢక్ ప్రాంతాల్లో భారతీయ జనతాపార్టీ మంచి ఫలితాలు సాధించింది. అందువల్ల ఈ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, కష్ట నష్టాల గురించి భాజపా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ సమస్యకు పరిష్కారం కనుగొనడం అంత తేలికైన వ్యవహారం కాదు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా చేతిలో వీటో అధికారం ఉన్నంతకాలం ఏ చర్య తీసుకోవాలనుకున్నా అది దుస్సాధ్యం. ఒమర్ అబ్దుల్లా చెబుతున్న దానికి, దేశంలోని ఇతరప్రాంతాలకు చెందిన రాజ్యాంగ నిపుణులు చెబుతున్న దానికి ఎంతో తేడా ఉన్నది.

చాలామంది న్యాయ నిపుణులు, రాజ్యాంగ నిపుణులు మాత్రం ఒక్క విషయంలో ఏకాభిప్రాయంతో ఉన్నారు. 370 అధికరణాన్ని ప్రభుత్వం ఎత్తివేయాలన్నదే వారి నిశ్చితాభిప్రాయం. చారిత్రకంగా చూస్తే ఈ అధికరణాన్ని రూపొందించడం నెహ్రూ చేసిన ప్రథమ తప్పిదం. ఇది తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనని నెహ్రూ అప్పట్లో పేర్కొన్నప్పటికీ, గత మే 27న నెహ్రూ 50వ వర్థంతి జరుపుకున్న నాటికి కూడా ఏవిధమైన మార్పు లేకుండా అది కొనసాగుతూనే ఉంది. మరి ఇక్కడ ‘తాత్కాలిక’మన్న పదాన్ని సైద్ధాంతికపరంగా మరింత విస్తృతకోణంలో ఆలోచించాలా? కానీ మనం అంగీకరించాల్సిన పచ్చినిజం ఒకటుంది. కేవలం ఈ అధికరణం కారణంగా కలుగుతున్న అనేక అడ్డంకుల వల్ల భారతదేశం పెద్ద మూల్యమే చెల్లించుకుంటోంది. పెద్ద మొత్తంలో ధనాన్ని కేటాయిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వంపై అతి తక్కువ నియంత్రణ కలిగివుండటమన్న దుస్థితికి మించిన దౌర్భాగ్యం మరోటుండబోదు.

ఇటువంటి గాయాలకుతోడు అత్యంత అవమానకరమైన అంశమేమంటే, లోయలో వేర్పాటువాదులు, ఉగ్రవాదుల సానుభూతిపరులు, వారికి సహాయం చేసేవారిని జమ్ము-కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో గౌరవంతో చూడటం. దీనికి తోడు భారత సాయుధ మరియు పారామిలటరీ బలగాలు, ఇంటెలిజెన్స్ సంస్థలను కేవలం సరిహద్దు రక్షణకు మాత్రమే కేటాయించడం. ఇందుకోసం అంతూపంతూ లేకుండా ప్రజల ధనం విచ్చలవిడిగా ఖర్చవుతోంది. ఇంత కష్టపడి ఇంత ఖర్చును కేంద్ర ప్రభుత్వం భరిస్తున్నప్పటికీ ఫలితమేమైనా ఉన్నదా అంటే అదీ లేదు. భద్రతా బలగాలు ఎక్కడ ఏ ఎన్‌కౌంటర్‌కు పాల్పడినా...అది నకిలీ ఎన్‌కౌంటర్ అనీ, అమాయకులను బలితీసుకున్నారంటూ తీవ్రస్థాయిలో గొంతు చించుకొని నానా గందరగోళం చేయడం ఒక వ్యూహం ప్రకారం కొనసాగుతున్న వైపరీత్యం. నిజం చెప్పాలంటే 1947 నుంచి ఇప్పటి వరకు జరిగిన పోరాటాల్లో మరణించిన మన బలగాల కంటే, శాంతి సమయంలో జమ్ము-కాశ్మీర్‌లో నిర్వహించిన విధి నిర్వహణలో మృతులైనవారి సంఖ్య చాలా అధికమన్నది మాత్రం నిష్టుర సత్యం.

ప్రస్తుత పరిణామాలను గమనిస్తే నేషనల్ కాన్ఫరెన్స్, పిడిపిలు కేవలం తమ రాజకీయ ప్రయోజనాలకోసం గంగవెర్రులెత్తినట్టు చేసిన ప్రకటనలు తప్ప, 370 అధికరణాన్ని ఎత్తివేసే యత్నాలను అడ్డుకోవడానికి పెద్దగా చెప్పుకోదగింది ఏమీ లేదు. ఒక్కసారి ఇందిరాగాంధీ హయాంను గుర్తు చేసుకోండి. బ్రిటిష్ వారి పరిపాలనలో ఉన్న సంస్థానాధీశులకు..తమ సంస్థానాలను భారత యూనియన్‌లో విలీనం చేసినందుకు, వారికి ‘రాజ భరణం’ పేరుతో చెల్లిస్తూ వస్తున్న మొత్తాన్ని ఇందిరాగాంధి ధైర్యంగా రద్దు చేసింది. నిజానికి బ్రిటిష్ ప్రభుత్వంతో వారు కుదుర్చుకున్న ఒప్పందం మేరకు వారికి చెల్లించే రాజభరణాలను రద్దు చేయడానికి వీల్లేదు. కానీ ఇందిర ఆ పని చేసింది. పర్యవసానం ఏమయింది? నొరెత్తినవారు లేరు. అదేవిధంగా ప్రైవేటు బ్యాంకులు. కొంత కాలంపాటు అవి మనదేశంలో ఎన్నో రకాల సదుపాయాలు, సౌకర్యాలను అనుభవిస్తూ, ఇబ్బడి ముబ్బడిగా లాభాలను దండుకున్నాయి. కానీ మళ్ళీ ఇందిరాగాంధీ..ఈ బ్యాంకులన్నింటినీ జాతీ యం చేశారు. ఎవరు ప్రతిఘటించారు? ఎంతమేర ప్రతిఘటించారు? జాతీయం చేసిన తర్వాత మిన్నువిరిగి మీదపడలేదు. అంతా సవ్యంగా ప్రశాంతంగా జరిగిపోయింది. మరి దేశ ఆర్థిక వ్యవస్థలో జాతీయ బ్యాంకులు నేడు కీలక పాత్ర పోషిస్తున్నాయి.

జమ్ము-కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న అధికరణాన్ని కేంద్ర ప్రభుత్వం ఎత్తేసిందనుకుందాం. దీనివల్ల భద్రతాపరమైన మరియు వేర్పాటు వాదుల కారణంగా అనేక ఇబ్బందులు తలెత్తవచ్చు. అంతేకాదు పాకిస్థాన్, బహుశా చైనా, రష్యా, పశ్చిమ దేశాల నుంచి బహుశా వత్తిళ్ళు రాకమానవు. కానీ ఎప్పటికప్పుడు ఆ రాష్ట్రానికి ఇస్తున్న భారీ రాయితీలను మన దేశం ఎంతకాలం భరించగలదు?

"చాకిరేవు" కంపు పోవాలంటే పిచికారీ చేయవలసిందే !


వొక ఆడకూతురు ను ఎదుర్కొనే దమ్ములేక  దొడ్డి దారిలోనుంచి రూమర్లు సృష్టించి , బురద చాల్లే కార్యక్రమము కొందరు పెయిడ్ సైబర్ లేబర్ గాల్ల  ద్వారా చేయిస్తూ  (ఎవరు చేయిస్తున్నారో ఆధారాలతో తెలుసు) ఆ విధంగా ముందుకు పోతున్న 'శిఖండి' గాడికి మరియు వాడి పెయిడ్ వర్కర్లకు చరమ గీతం పాడే సమయం దగ్గరలోనే వుంది.

సాదారణంగా ఇలాంటి విషయాల్లో పార్టీలకు అతీతంగా 'మద్దతు' పలుకుతారు అందరు. కానీ చాకిరేవులో మాసిపోని బట్టలు మాత్రామే వుతికే వొక  పెద్దమనిషి గా చెలామణి అయ్యే వొక అల్పమనిషికి   మాత్రం  ఇది తప్పు గా కనిపించలేదు. పైగా ఎప్పుడో ఎన్నికల ప్రచార సభల్లో 'ఎవరో పెద్దమనిషిని' ఆ ఆడకూతురు ఏక వచనంతో  పిలిచిందట, అందులకు ఈయనగారికి ఎక్కడో కాలిందట. అయ్యా  మలినం లేని బట్టలు మాత్రమే వుతికే పెద్ద మనిషీ ఎన్నికల స్పీచ్లో ఎలా మాట్లాడాలో , ఏది సంస్కారమో నీతో చెప్పించుకొనే స్థితిలో ఇక్కడ ఎవరులేరు. తమరు తెలుసుకో వలసిందిగా మనవి.

 వొక స్త్రీకి గౌరవం ఇవ్వని నువ్వు ఈ భూమిమీద జీవించడానికే అనర్హుడవు. నువ్వుకుడా వొక స్త్రీ  కే  జన్మించావని తెలుసుకో.

ఇంకో విషయం ... అక్కడ ఎవరు బాంచన్ దొరా అనమని అడగలేదు. మదాన్దకారంతో కొవ్వీక్కి తైతక్క లాడుతున్న రెండు నీచ మీడియా సంస్థల వీపు మీద రెండు వాతలు పెట్టారు అంతే . ఇది కూడా తప్పుకాదుఅని తెలుసుకో.




Friday, May 30, 2014

మోడీ గారు వివాదాలతో శ్రీకారం చుట్టడం ఎంత మాత్రం శ్రేయస్కరం?


మోడీ సర్కార్లో ఇంకా మంత్రులంతా పూర్తిగా బాధ్యతలు కూడా ప్రారంభించక ముందే... వరుసగా వివాదాలు చుట్టుముడుతున్నాయి. గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేయలేదని ఆరోపణలు ఎదుర్కొంటున్న స్మృతి ఇరానీకి కేబినెట్ హోదా.. అదీ దేశ ఉన్నత విద్యావ్యవస్థకు ఆయువుపట్టు అయిన మానవ వనరుల శాఖను అప్పగించడంపై ఇప్పటికే వివాదం మొదలైంది. ఇది అంత తీవ్రమైంది కాకపోయినా.. దేశంలోనే అత్యంత వివాదాస్పమైన ఆర్టికల్ 370 తేనెతుట్టెను కదపడమంటే మామూలు విషయం కాదు. మోడీ సర్కారు ముందు ఎన్నో సవాళ్లు ఉండగా.. ఇలాంటి అత్యంత సున్నితమైన సమస్యపై బీజేపీ సర్కారు కావాలని ఎందుకు వివాదం మొదలుపెట్టిందన్నది ఆలోచించతగ్గవిషయం.
అసలు ఈ ఆర్టికల్ 370 ఏంటి..? జమ్ము & కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు భారత రాజ్యంగంలో కల్పించిన వెసులుబాటే ఈ ఆర్టికల్ 370. 1949 నుండి ఇది అమల్లో ఉంది. దీని ప్రకారం జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి కొన్ని ప్రత్యేక హక్కులుంటాయి. జమ్మూకాశ్మీర్ వాసులు కాకుండా ఇతర రాష్ట్రాల వారు ఇక్కడ స్థిరాస్థుల అమ్మకాలు , కొనుగోళ్లు చేయకూడదు. ఇక్కడ భూములపై ఇతర ప్రాంతవాసులకు ఎలాంటి హక్కులు కల్పించరు. ఈ ఆర్టికల్ కారణంగానే జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి దూరమవుతోందని.. దేశంలో ఏ రాష్ట్ర్రానికి లేని స్వయం ప్రతిపత్తి జమ్మూకాశ్మీర్ కు మాత్రం ఎందుకుండాలని.. బీజేపీ ప్రశ్నిస్తోంది. అయితే బీజేపీ వాదనలో వాస్తవం కొంత మాత్రమే. ఇదే తరహాలో ఆర్టికల్ 371లోని కొన్ని అధికరణ ద్వారా చాలా రాష్ట్రాలకు రాజ్యాంగం ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిందన్న సంగతిని మాత్రం పెద్దగా పట్టించుకోదు.
ఇప్పుడు ఎందుకు వివాదం..? బీజేపీ, దాని మూలాలైన హిందుత్వ సంస్థలు... ఎప్పటి నుంచో ఆర్టికల్ 370 రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఉమ్మడి పౌర స్మృతి ఉండాలని కోరుతున్నాయి. దశాబ్దాల తరబడి ఈ సంస్థలు, బీజేపీ గొంతుచించుకుంటున్నా.. ఈ డిమాండ్ నెరవేరే అవకాశం లభించలేదు. బీజేపీ ఎప్పుడూ సొంతంగా అధికారం చేపట్టకపోవడం.. కాంగ్రెస్ వంటి సెక్యులర్ పార్టీలు ఆ దిశగా కూడా ఆలోచించకపోవడంతో హిందుత్వ సంస్థల చిరకాల వాంఛ అలాగే ఉండిపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు నరేంద్రమోడీ పుణ్యమా అని.. బీజేపీ సొంతంగా అధికారంలోకి వచ్చేటప్పటికి.. మళ్లీ ఈ వివాదం ఊపిరిపోసుకుంటోంది. తన మాతృ సంస్థలను సంతృప్తి పరిచేందుకు బీజేపీ నేతలు .. ఆర్టికల్ 370పై చర్చ అవసరం.. అంటూ కేంద్ర మంత్రి.. అందులోనూ ప్రధానమంత్రి కార్యాలయం మంత్రి... జితేంద్ర ప్రసాద ఈ వివాదానికి తెరతీశారు. ఈ ఆర్టికల్ ద్వారా కాశ్మీరీ ప్రజలకు మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతోందన్నారు జితేంద్ర ప్రసాద. బీజేపీ అధికార పగ్గాలు అందుకుందని తెలియగానే ఇలాంటి వివాదాలు వస్తాయని అందరూ ఊహించిందే అయినా.. మరీ ఇంత త్వరగా.. కనీసం వారం కూడా కాకుండానే.. బాధ్యతలు చేపట్టిన రోజే ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కేవలం యథాలాపంగా జరిగిందని అనుకునే వీల్లేదు.
ఇక ముందు ఏం జరగబోతోంది... ? జమ్మూకాశ్మీర్ కు మాత్రమే సంబంధించిన వ్యవహారంగా కనిపించినా.. ఇది దేశమంతటినీ ప్రభావితం చేసే సున్నితమైన సమస్య.. మెజారిటీ ఉంది కదా అని బీజేపీ, దాని మాతృసంస్థలు... ఏకపక్షంగా తమ చిరకాల వాంఛలను తీర్చుకునే ప్రయత్నం చేస్తే.. అవి వికటించే అవకాశాలే ఎక్కువ. నల్లధనం, అవినీతి నిర్మూలన, పేదరిక నిర్మూలన, ఆర్థిక స్థిరత్వ సాధన.. ఇలా ఎన్నో సమస్యలు మోడీ సర్కారుకు ఆహ్వనం పలుకుతున్న సమయంలో ఇలాంటి వివాదాల ద్వారా.. దూకుడు ప్రదర్శిస్తే... అనుకున్న సమయం కంటే ముందుగానే మోడీ చెడ్డపేరు మూటగట్టుకునే ప్రమాదం ఉంది. అసలే గుజరాత్ అల్లర్లు, ఉచకోత ఆరోపణల నేపథ్యం ఉన్న మోడీ సర్కారు.. తొలి అడుగులు ఎంతో జాగ్రత్తగా వేయాల్సింది పోయి.. ఇలా వివాదాలతో శ్రీకారం చుట్టడం ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు. ఈ వివాదానికి ఎంత త్వరగా ముగింపు పలికింతే అంత మంచిది.
-searched eyes

Wednesday, May 28, 2014

మన భావితరాల తలరాత - మన పిల్లల భవిష్యతు మార్చేందుకు...


ఇది మన భావి తరాల తల రాత మార్చేందుకు
ఇది మన పిల్లల భవిష్యతు మార్చేందుకు
ఇది డాలర్ కు వ్యతిరేకంగా ఉద్యమం
ఇది సఫలమైతే మనం మన పిల్లల్ని అమెరికాకు పంపాల్సిన అవసరం ఉండదు
ప్రపంచ వర్తక రంగాన్ని శసించవచ్చు
ప్రతి బారతియుడు 365 రోజులు ఇండియా లో తయారయిన వస్తువులను మాత్రమె కొనుగోలు చేయగలిగితే
భారతదేశం ప్రపంచం లో రెండోవ అతి పెద్ద ఆర్దిక పరిపుష్టి కలిగిన దేశం గా ఆవిర్బవిస్తుంది
మన 2 రూపాయిలు ఒక డాలరుకు సమానంగా వస్తుంది
rbi రూపాయి విలువ కాపాడడానికి తంటాలు పడవలసిన అవసరం లేదు
నిరుద్యోగ సమస్య చాల వరకు పరిష్కరిమ్పబడుతుంది
కాబట్టి మనం తప్పనిసరిగా ఇండియా లో తయారి అయిన వస్తువులను మాత్రమే కొందాం
1970 లో ఇక డాలరు 4 రూపాయిలకు సమానం
ఇప్పుడు ఒక డాలరు దాదాపు 60 రూపాయిలకు పైన ఉంది
దీనర్దం డాలరు బలపడటం లేదు మన రూపాయిని మనమే బలహీన పరుస్తున్నాం విదేశి వస్తువుల కొనుగోళ్ళ ద్వారా
అది ఎలా ఒక సారి చూద్దాం
1. cool drinks  :
కొనవలసినవి :  : లస్సి , కొబ్బరిబొండం , నిమ్మకాయ సోడా , మజ్జిగ తాగండి మన ఆరోగ్యానికి కూడా ఇవి మంచిది
కొనకూడనివి :  Thums up , Pepsi 
2. Soaps:
కొనవలసినవి :  Cinthol, Santoor, Mysore sandal, Medimix, Neem, Godrej.
కొనకూడనివి :  Lux, Lifebuoy, Rexona, Liril, Dove, Pears, Hamam, Camay, Palmolive.
3. Toothpaste:
కొనవలసినవి :  Neem, Babool, Vicco, Dabur.

కొనకూడనివి :  Colgate, Close up,Pepsodent, Cibaca.
4. Toothbrush:
కొనవలసినవి :  Prudent, Ajanta, Promise.
కొనకూడనివి :  Colgate, Close up, Oral-b, Pepsodent, Forhans.
5. Shaving cream:
కొనవలసినవి :   Godrej, Emami.
కొనకూడనివి :  Palmolive, Old spice, gillete.
6. Blade:
కొనవలసినవి :  Supermax, topaz, laser, ashoka.
కొనకూడనివి :  7-o-clock, 365, gillete.
7. Talcum powder:
కొనవలసినవి :  Santoor, Gokul, Cinthol, Boroplus.
కొనకూడనివి :  Ponds, Old spice, johnson n johnson,Shower to Shower.
8. Milk powder:
కొనవలసినవి :  Indiana, Amul, Amulya.
కొనకూడనివి :  anikspray, milkana, everyday milk, milkmaid.
9. Shampoo:
కొనవలసినవి :  Nirma, Velvette.
కొనకూడనివి :  Halo, All clear, Sunsilk, Head and Shoulders, Pantene.
10. Mobile connections:
కొనవలసినవి :  bsnl, mtnl, airtel, aircel, reliance, idea.
కొనకూడనివి :  Vodafone.
11. Food:
కొనవలసినవి :  Eat at all Indian foods Only in Indian and Local Restaurants. Try State Special foods at the Respective States. (cheap, fresh, hygienic, tasty too..)
కొనకూడనివి :  McDonald's, Subway, Pizza hut, KFC. (prepared from months long products and serve only with hot, spices, sauces, decorations)
12. Mobile:
కొనవలసినవి :  CELKON, Micromax, Karbonn, Lava.
కొనకూడనివి :  Samsung, apple, htc, sony.
13. Bikes:
కొనవలసినవి :  Hero, Bajaj, Mahindra.
కొనకూడనివి :  Honda, Yamaha, Suzuki.
14. Footwear:
కొనవలసినవి :  Paragon, Chavda, Lakhani.
కొనకూడనివి :  Nike, Reebok, Adidas,Converse.
15. Jeans and shirts:
కొనవలసినవి :  Spykar, k-lounge.
కొనకూడనివి :  Lee, Levi's, U.s. Polo, Pepe, Benetton.
16. Watches:
కొనవలసినవి :  Titan, Sonata, Fasttrack.
కొనకూడనివి :  Tommy, Citizen, Zodiac, Tissot.
హిందూస్తాన్ లీవర్ ఉత్పాదనలు వాడకండి అవి పేరుకు మాత్రం హిందూస్తాన్ కాని విదేశి ఉత్పాదనల కంపెని అది
మీరు విదేశి ఉత్పాదనలు వాడితే మన ప్రభుత్వం వారికి డాలర్స్ లో చెల్లిస్తుంది అంతే మొత్తాన్ని
అది ఎలాగంటే samsung s 4- రూ : 41000/- అదే ఫ్యూచర్స్ తో micromax రూ : 17000/- కె అందిస్తుంది మిగిలిన రూ : 24000/- మనం samsung స్4 కొంటె సౌత్ కొరియాకు డాలర్ రూపంలో
చెల్లిస్తున్నాం అంటే 24000/- మనం అనవసరంగా తగలేస్తున్నం ఆ డబ్బు తో వాళ్ళు ఎదుగుతున్నారు
వాళ్ళ ఉత్పదనలతో మన ఉత్పాదనలు ఎ మాత్రం తీసిపోవు కాకపోతే వాళ్ళు కాస్త డెకరేటివ్గా కాస్త హంగామా చేసి ఇస్తారు దాని కి మనం మోజు పడొద్దు
చైనా మనకన్నా ఎందుకు ముందుంది అలోచినచారా ప్రపంచ దేశాలలో చాలావరకు చైనా వస్తువులు కొనుగోలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కేవలం మనం మన దేశ వస్తువులను కొనలేమా
ఇది మేము మొదలు పెడుతున్నాం మీరు మొదలు పెట్టండి ఈ msg మన 123 కోట్ల భారతీయులకు చేరేలా షేర్ చెయ్యండి మీ వంతుగా
ఆ నాడు విదేశి వస్తు భాహిస్కరణ మనం చుడలేకపోయం కాని మనం ఆ ఉద్యమం మళ్ళి చేపట్టే అరుదైన బాగ్యాన్ని పొందబోతున్నాం మేము దానిలో పాల్గొ బోతున్నాం మరి మీరుపాల్గొటారని ఆశిస్తున్నాం
- పీపుల్స్ వాయిస్

Sunday, January 26, 2014

నీకు హాక్ చేసే దమ్ముందా ?

నీకు హాక్ చేసే దమ్ముందా ? వుంటే  17 కోట్ల రూపాయలు నీ సొంతం ....... అది ఎలా అంటే ... గూగుల్ క్రోమ్ హాక్ చేసిన వారికి .. గూగుల్ వాళ్ళు ఇచ్చే బహుమతి ఇది . వివరాలు కింద చూడండి .

గూగుల్.. రూ. 17 కోట్ల ఆఫర్

గూగుల్.. రూ. 17 కోట్ల ఆఫర్
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ భారీ ఆఫర్ ప్రకటించింది. మార్చిలో నిర్వహించే హ్యాకింగ్ కాంటెస్ట్ లో విజేతగా నిలిచిన వారికి 17 కోట్ల రూపాయిల ప్రైజ్ మనీ ఇవ్వనుంది. బ్రౌజర్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ క్రోమ్ ఓఎస్ ను హ్యాక్ చేసిన పరిశోధకులకు ఈ నగదు బహుమతి ప్రధానం చేయనుంది. కెనడాలోని వాంకోవర్ లో ఈ కాంటెస్ట్ జరగనుంది. గతేడాది కూడా ఇలాంటి కాంటెస్ట్ నిర్వహించిన గూగుల్ భారీ నగదు బహుమతి ఇచ్చింది.

గూగుల్ తరచూ ఇలాంటి పోటీలను నిర్వహిస్తోంది. దీనివల్ల క్రోమియంకు మరింత భద్రత ఉండేలా రూపొందించేందుకు ఉపయోగపడుతుందని గూగుల్ ప్రతినిధులు చెప్పారు. రక్షణకు సంబంధించి పరిశోధకుల నుంచి కీలక విషయాలను నేర్చుకోవచ్చని తెలిపారు. గూగుల్ ఇంకా పలు ఆఫర్లు ప్రకటించింది.