Friday, May 30, 2014

మోడీ గారు వివాదాలతో శ్రీకారం చుట్టడం ఎంత మాత్రం శ్రేయస్కరం?


మోడీ సర్కార్లో ఇంకా మంత్రులంతా పూర్తిగా బాధ్యతలు కూడా ప్రారంభించక ముందే... వరుసగా వివాదాలు చుట్టుముడుతున్నాయి. గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేయలేదని ఆరోపణలు ఎదుర్కొంటున్న స్మృతి ఇరానీకి కేబినెట్ హోదా.. అదీ దేశ ఉన్నత విద్యావ్యవస్థకు ఆయువుపట్టు అయిన మానవ వనరుల శాఖను అప్పగించడంపై ఇప్పటికే వివాదం మొదలైంది. ఇది అంత తీవ్రమైంది కాకపోయినా.. దేశంలోనే అత్యంత వివాదాస్పమైన ఆర్టికల్ 370 తేనెతుట్టెను కదపడమంటే మామూలు విషయం కాదు. మోడీ సర్కారు ముందు ఎన్నో సవాళ్లు ఉండగా.. ఇలాంటి అత్యంత సున్నితమైన సమస్యపై బీజేపీ సర్కారు కావాలని ఎందుకు వివాదం మొదలుపెట్టిందన్నది ఆలోచించతగ్గవిషయం.
అసలు ఈ ఆర్టికల్ 370 ఏంటి..? జమ్ము & కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు భారత రాజ్యంగంలో కల్పించిన వెసులుబాటే ఈ ఆర్టికల్ 370. 1949 నుండి ఇది అమల్లో ఉంది. దీని ప్రకారం జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి కొన్ని ప్రత్యేక హక్కులుంటాయి. జమ్మూకాశ్మీర్ వాసులు కాకుండా ఇతర రాష్ట్రాల వారు ఇక్కడ స్థిరాస్థుల అమ్మకాలు , కొనుగోళ్లు చేయకూడదు. ఇక్కడ భూములపై ఇతర ప్రాంతవాసులకు ఎలాంటి హక్కులు కల్పించరు. ఈ ఆర్టికల్ కారణంగానే జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి దూరమవుతోందని.. దేశంలో ఏ రాష్ట్ర్రానికి లేని స్వయం ప్రతిపత్తి జమ్మూకాశ్మీర్ కు మాత్రం ఎందుకుండాలని.. బీజేపీ ప్రశ్నిస్తోంది. అయితే బీజేపీ వాదనలో వాస్తవం కొంత మాత్రమే. ఇదే తరహాలో ఆర్టికల్ 371లోని కొన్ని అధికరణ ద్వారా చాలా రాష్ట్రాలకు రాజ్యాంగం ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిందన్న సంగతిని మాత్రం పెద్దగా పట్టించుకోదు.
ఇప్పుడు ఎందుకు వివాదం..? బీజేపీ, దాని మూలాలైన హిందుత్వ సంస్థలు... ఎప్పటి నుంచో ఆర్టికల్ 370 రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఉమ్మడి పౌర స్మృతి ఉండాలని కోరుతున్నాయి. దశాబ్దాల తరబడి ఈ సంస్థలు, బీజేపీ గొంతుచించుకుంటున్నా.. ఈ డిమాండ్ నెరవేరే అవకాశం లభించలేదు. బీజేపీ ఎప్పుడూ సొంతంగా అధికారం చేపట్టకపోవడం.. కాంగ్రెస్ వంటి సెక్యులర్ పార్టీలు ఆ దిశగా కూడా ఆలోచించకపోవడంతో హిందుత్వ సంస్థల చిరకాల వాంఛ అలాగే ఉండిపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు నరేంద్రమోడీ పుణ్యమా అని.. బీజేపీ సొంతంగా అధికారంలోకి వచ్చేటప్పటికి.. మళ్లీ ఈ వివాదం ఊపిరిపోసుకుంటోంది. తన మాతృ సంస్థలను సంతృప్తి పరిచేందుకు బీజేపీ నేతలు .. ఆర్టికల్ 370పై చర్చ అవసరం.. అంటూ కేంద్ర మంత్రి.. అందులోనూ ప్రధానమంత్రి కార్యాలయం మంత్రి... జితేంద్ర ప్రసాద ఈ వివాదానికి తెరతీశారు. ఈ ఆర్టికల్ ద్వారా కాశ్మీరీ ప్రజలకు మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతోందన్నారు జితేంద్ర ప్రసాద. బీజేపీ అధికార పగ్గాలు అందుకుందని తెలియగానే ఇలాంటి వివాదాలు వస్తాయని అందరూ ఊహించిందే అయినా.. మరీ ఇంత త్వరగా.. కనీసం వారం కూడా కాకుండానే.. బాధ్యతలు చేపట్టిన రోజే ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కేవలం యథాలాపంగా జరిగిందని అనుకునే వీల్లేదు.
ఇక ముందు ఏం జరగబోతోంది... ? జమ్మూకాశ్మీర్ కు మాత్రమే సంబంధించిన వ్యవహారంగా కనిపించినా.. ఇది దేశమంతటినీ ప్రభావితం చేసే సున్నితమైన సమస్య.. మెజారిటీ ఉంది కదా అని బీజేపీ, దాని మాతృసంస్థలు... ఏకపక్షంగా తమ చిరకాల వాంఛలను తీర్చుకునే ప్రయత్నం చేస్తే.. అవి వికటించే అవకాశాలే ఎక్కువ. నల్లధనం, అవినీతి నిర్మూలన, పేదరిక నిర్మూలన, ఆర్థిక స్థిరత్వ సాధన.. ఇలా ఎన్నో సమస్యలు మోడీ సర్కారుకు ఆహ్వనం పలుకుతున్న సమయంలో ఇలాంటి వివాదాల ద్వారా.. దూకుడు ప్రదర్శిస్తే... అనుకున్న సమయం కంటే ముందుగానే మోడీ చెడ్డపేరు మూటగట్టుకునే ప్రమాదం ఉంది. అసలే గుజరాత్ అల్లర్లు, ఉచకోత ఆరోపణల నేపథ్యం ఉన్న మోడీ సర్కారు.. తొలి అడుగులు ఎంతో జాగ్రత్తగా వేయాల్సింది పోయి.. ఇలా వివాదాలతో శ్రీకారం చుట్టడం ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు. ఈ వివాదానికి ఎంత త్వరగా ముగింపు పలికింతే అంత మంచిది.
-searched eyes

8 comments:

  1. అధ్యక్షా పోస్ట్ రాసే ముందు విషయం పూర్తిగా తెలుసుకోవాలని విఙప్తి ... జమ్ము కాష్మీరు ఆస్తుల విషయం లోనే కాదు .. అక్కడ విద్యా హక్కు చట్టం పనిచెయదు , రైట్ టు ఇంఫర్మేషన్ ఆక్ట్ పనిచేయదు ...మన పార్లమెంట్ చేసిన ఏదైనా చట్టం కాష్మీరు లో పనిచేయాలంటే వాళ్ళ పార్లమెంటు లో కూడా అది పాస్ అవ్వాల్లి ... పర్లమెంటు ఏంటి అనుకోకండి కాస్మీరు అసెంబ్లీ ని పార్లమెంట్ అనాలి అసెంబ్లి అనకూడదు!
    పి.ఎం.ఓ వారు నేరుగా కాస్మీర్ ని నియంత్రించలేరు ... వారి వార్షిక బడ్జెట్ కి మన భారతదేశ ప్రభుత్య్వమే డబ్బులు ఇవ్వాలి కానీ 370 కారణంగా మన ప్రభుత్వానికి ఖర్చు ల పద్దు అడిగే అధికారం లేదు ... అంటే అక్కడ జరుగుతున్న నిధుల దుర్వినియోగం గురించి అడిగే అధికారం ప్రధానికి లేదు!!
    అందుకే అక్కడ వచ్చే ప్రభుత్వాలు అన్ని 370 ని సమర్దిస్తాయి ఎందుకంటే తిన్నంత తినవచ్చు అడిగే వారు ఉండరు కదా!!!
    కాస్త లోతుగా చూస్తే ఇప్పటీకే చాలా ఆలస్యం జరిగింది అని మీకు అర్థం అవుతుంది ....
    కాష్మీరు లో మన జాతీయ జెండాకి పూర్తి గుర్తింపు ఉండదు ...అక్కడ మన జెండాని కాల్చడం నేరం కాదు కానీ మిగతా దేశం లో నేరం ....ఇలాంటి కొన్ని దరిద్రాలు చాలా ఉన్నాయి!
    కాష్మీరి పండిట్ల ఆస్తులకి రక్షణ లేదు ...వారు ఇప్పటికీ శరణార్థులు గా డిల్లీ లో ఉంటున్నరు!
    370 తాత్కాలికం అని రాజ్యాంగం లో ఉంది 67 యేళ్ళు కూడా తాత్కాలికమేనా ....ఏంటసలు తాత్కాలికం అర్థం ఏంటి కాంగిరేసు వాళ్ళు చేసింది ఏంటీ ...వాజ్పేయి కూడా ఈ అమ్షాన్ని చర్చించాడు కానీ సంకీర్ణ ప్రభ్త్వం కనుక ముందుకి వెల్లలేక పోయాడు ...ఇప్పుడు పూర్తి మెజారిటీ వచ్చాక కూడా చర్యలు తీసుకోక పోతే ఇక అంతే సంగతులు!.
    Narsimha K.

    ReplyDelete
    Replies
    1. నా పోస్ట్ ఆంతర్యం ఏంటంటే , మోడీ ప్రభుత్వం చేయాల్సిన డెవలప్మెంట్, ఎదుర్కోవలసిన సవాళ్ళు చాలావున్నాయి , ముందు వాటి మీద ఫోకస్ చేసి తరువాత ఇలాంటి వివాదాస్పద ఇష్యూ స్స్ మీద ఫోకస్ చేసి వుంటే బాగుండును అని అంటున్నాను.

      Delete
    2. మీరు కూడా దేశం లో ఎన్నో సమస్యలు ఉండగా ఇదే ఎందుకు రాసారు ?
      ఎవరో ఒకరో ఎపుడో అపుడు అడుగు వేయాలి కదా , అది ఇదే అవ్వొచ్చు .

      Delete
    3. మీరు అనుకున్నంత త్వరగా ఎమి జరగడం లేదు .... కానీ పార్లమెంటు మొదటీ సమావెషం లో ఈ మార్పు జరిగి తీరాలి.
      లేకుంటే ఈ రోజు బిహార్ ముక్యమంత్రి సపొర్ట్ చేసినట్ళు రేపు కే.సి. ఆర్ .... మమతా బెనర్జీ చాలా సిల్లీ గా సపోర్ట్ చేసి అదే 370 వారి రాష్టాలకీ కావాలి అని అడిగేయ్గలరు పెద్ద గా తేడా తెలియని మొఖాలు!!
      అసలు ఇన్నేళ్ళు ఇప్పుడెందుకు లే అనుకోబట్టే ఇప్పటికీ ఆ అంశం మనగలిగింది!
      ఆ 370 ని చూసుకునే పాకిస్తాన్ రేగిపోతుంది!
      కాస్త లోతుగా ఈ 370 చదవండి చదవటం పూర్తి అయిన మరు క్షణం మీరు దాన్ని రద్దు చేయాలి అంటారు.
      అసలు మొదటి రోజే ఒక స్టేట్ మెంట్ ఇచ్చి చాలా మంచి పనిచేసారు ప్రభుత్వం వారు ...దాని వల్ల 370 గురించి తెలియని చాలా మందికి సోషల్ నెట్వర్క్ ద్వారా విషయం స్ప్రెడ్ అయ్యింది ..
      బ్లాగులో డిస్కషన్స్ వల్ల ఇంకొంత మందికి చేరవేసె ప్రయత్నం మీ వల్ల జరిగింది కనుక కృతఙతలు .. :)
      Narsimha K.

      Delete
    4. అన్నిటికన్నా ఘోరమైన విషయం ఏంటో తెలుసా? భారతదేశవాసిని పెళ్లి చేసుకున్న కాశ్మీరీ మహిళ తన కాశ్మీరీ పౌరసత్వాన్ని కోల్పోతుంది. అదే.. కాశ్మీరీ మహిళను ఒక పాకిస్థానీయుడు పెళ్లి చేసుకుంటే వాడికి కాశ్మీరీ పౌరసత్వం వస్తుంది. ఇప్పుడు చెప్పండి.. ఇంకా 370 ఆర్టికల్ కావాలా మీకు?

      Delete
    5. వద్దు ..370 ఆర్టికల్ వెంటనే రద్దు చేయాలి .. చాలా విషయాలు వివరించినందుకు మీకు ధన్యవాదాలు నరసింహ గారు . :)

      Delete
  2. Pilli medalo ganta kattedevaru? innaalluu ee amsanni naana betti desaprajalani mabhya petti , poorthi nijaalu prajalaki teliyaneeyakundaa daachipetti dushta paalana saaginchindi NEHRU kutumbam. Nijame idi nehru-abdulla la loguttu , kutra
    intha kante lothuga ........ippudu kaadu kaani...
    mothaaniki ee 370 ni raddu cheyyalsinde.....thondara denikee ante......aalasyam amrutham visham. Repu mamanadena?

    ReplyDelete
  3. 370 ని రద్దు చేస్తే అందరికి సంతోసమే , కాని సుభమా అని ప్రభుత్వం మొదలవుతూనే వివాదాల్లో మోడీ పాలన ఎలా సాగుతుందో అనే... ఆందోళన అంతే .

    ReplyDelete