Sunday, December 29, 2013

పెళ్లి వొక ఆట

పెళ్లి అనేది జీవిత బంధం. జీవితానికి వొక్కసారే పెళ్లి ,  వొక్కరే భార్య - భర్త.  భార్య భర్తల బంధం అనేది  మేరు పర్వతం లాగ తొనకదు-బెనకదు. చిన్నచిన్న ఇన్సిడెంట్స్ కే  తొనికితే దాన్ని బంధం అనరు, అది సంసారమూ కాదు. 

నిన్ననే పవన్ కళ్యాణ్  ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నాడు.  ఇప్పుడు చేసుకున్న రష్యన్ - ఆస్ట్రేలియన్  అమ్మాయి మాత్రం శాశ్వతమని గారంటీ ఏంటి ? నన్నడిగితే ఈ పెళ్లి కూడా కొన్నాళ్ళే లేక కొన్నేళ్ళే . చివరికి పవన్ నాలుగో పెళ్లి కి కూడా రెడీ .. అనే చెప్తా . మూడు కాదు ముప్పై పెళ్ళిళ్ళు చేసుకున్నా పవన్ లాంటి వాడికి నిలకడ వుండదు.  పెళ్లి అనే బంధం నిలబెట్టుకోలేని వాడికి పెళ్లి (పెళ్ళిళ్ళు) అవసరమా ?  పవన్ కళ్యాణ్ పెళ్లి వొక చర్చనీయ అంశం ఎందుకు అయినదంటే , ప్రముఖమైన వ్యక్తుల జీవన విధానాల ప్రభావం సాధారణ ప్రజలమీద పరోక్షంగా  పడుతుంది. "ఆ....  పవన్ కళ్యానే  చేసుకున్నాడట  మూడు పెళ్ళిళ్ళు" ఇక మామూలు మనిషిని నేనెంత ? ఇలా..  నేనెంత-నేనెంత అనుకుంటూనే విష వాయువులా సమాజం లోకి ప్రవేశించి, అంతంత మాత్రం వుంటూ, చస్తూ బ్రతుకుతూ వున్న వివాహ వ్యవస్థ వుపిరాడక  పూర్తిగా చచ్చే ప్రమాదం వుంది. అందుకే ఈ ఆవేదన.

భార్యా భర్తలు విడిపోతున్నారంటే .. కొన్ని సంవత్సరాలు జీవన విధానం లో ఇమడలేక ఇక ఇద్దరి అభిప్రాయలు వేరు-వేరు , కలిసి జీవించలేము అని , వాళ్ళకు సంబంధించిన కుటుంభ పెద్దలతో సంప్రదించిన తరువాతనే నిర్ణయం తీసుకుంటారు. కాని పవన్ కల్యాన్  మాత్రం. అన్ని తానే , పెద్ద చిన్న గురువు దైవం అన్ని తానే. ప్రజారజ్యాన్ని తాకట్టు పెట్టుకున్నాడన్న  అపవాదు మినహా , చిరంజీవే ఈ విషయం లో ఉత్తముడు ఏక పత్నీవ్రతుడు.

పెళ్లి అనే బంధానికి విలువ తెలియని వాడిని ఇంకా మీరు అభిమానిస్తారా ? అని పవన్  అభిమానులకు సూటి  ప్రశ్న వేస్తూ .......................... . సెలవు

Tuesday, December 10, 2013

కంపుకొట్టినా అది సువాసనే "చాకిరేవు" కు

రెండెకరాల ఆసామి
వేలకొట్లకు అధిపథి యెట్లయ్యె. ?
రామయ్యెను  వెన్నుపొటు పొడిచి గద్దెనెట్లెక్కె ?
ఓనమాలు రాని పోకెశుడు .. స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటి కి ఎట్లెల్లె ?
బద్ధ శత్రువైన సొనెమ్మను కొలుచు ఆరాధకుడెట్లయ్యె ?

ఇలా చెప్పుకుంటు పోతుంటే భ్లాగ్ సరిపొదు.

ఇవి కనిపించలెదా "చాకిరేవు"లో వుతకడానికి ?
అవునులే ... ఇవి మన గురువింద గురువుల  'గుడ్డలు' కదా కంపుకొట్టినా  అది సువాసనే  మీకు ..
----------------------------------------------------------------------------------------

నోట్ : జఫ్ఫా ల ను అధోః జగత్తు లో వుంచి అలరిస్తున్నారు ...       దీనికి .... జావాబే  ఈ టపా !