నీకు హాక్ చేసే దమ్ముందా ? వుంటే 17 కోట్ల రూపాయలు నీ సొంతం ....... అది ఎలా అంటే ... గూగుల్ క్రోమ్ హాక్ చేసిన వారికి .. గూగుల్ వాళ్ళు ఇచ్చే బహుమతి ఇది . వివరాలు కింద చూడండి .
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ భారీ ఆఫర్ ప్రకటించింది. మార్చిలో
నిర్వహించే హ్యాకింగ్ కాంటెస్ట్ లో విజేతగా నిలిచిన వారికి 17 కోట్ల
రూపాయిల ప్రైజ్ మనీ ఇవ్వనుంది. బ్రౌజర్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ క్రోమ్
ఓఎస్ ను హ్యాక్ చేసిన పరిశోధకులకు ఈ నగదు బహుమతి ప్రధానం చేయనుంది.
కెనడాలోని వాంకోవర్ లో ఈ కాంటెస్ట్ జరగనుంది. గతేడాది కూడా ఇలాంటి
కాంటెస్ట్ నిర్వహించిన గూగుల్ భారీ నగదు బహుమతి ఇచ్చింది.
గూగుల్ తరచూ ఇలాంటి పోటీలను నిర్వహిస్తోంది. దీనివల్ల క్రోమియంకు మరింత భద్రత ఉండేలా రూపొందించేందుకు ఉపయోగపడుతుందని గూగుల్ ప్రతినిధులు చెప్పారు. రక్షణకు సంబంధించి పరిశోధకుల నుంచి కీలక విషయాలను నేర్చుకోవచ్చని తెలిపారు. గూగుల్ ఇంకా పలు ఆఫర్లు ప్రకటించింది.
గూగుల్.. రూ. 17 కోట్ల ఆఫర్
గూగుల్ తరచూ ఇలాంటి పోటీలను నిర్వహిస్తోంది. దీనివల్ల క్రోమియంకు మరింత భద్రత ఉండేలా రూపొందించేందుకు ఉపయోగపడుతుందని గూగుల్ ప్రతినిధులు చెప్పారు. రక్షణకు సంబంధించి పరిశోధకుల నుంచి కీలక విషయాలను నేర్చుకోవచ్చని తెలిపారు. గూగుల్ ఇంకా పలు ఆఫర్లు ప్రకటించింది.
No comments:
Post a Comment