Wednesday, November 13, 2013

''చంద్ర'' గ్రహణం

చంద్రబాబు నాయుడికి నిజంగానే గ్రహణం పట్టినట్ట్లే వుంది . ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్ర ప్రజలందరినీ పట్టి పీడిస్తున్న సమస్య 'రాష్ట్ర విభజన' . నిన్న జి ఓ యం  బృందంతో చర్చలకు  అన్ని రాజకీయ పార్టీలు వెళ్లి తమ తమ డిమాండ్లతో కూడిన అభిప్రాయాలని తెలియజేసాయి. 'నారా' వారు మాత్రం. రొమ్ చక్రవర్తిలా ఫిడల్ వాయిస్తూ కూర్చున్నాడు. ' నవ్వుతున్నారు నాన్న బయట  జనం '  అన్న 'బొమ్మరిల్లు' డైలాగ్ గుర్తుచేసుకోవలసిన సందర్భం ఇది. అయినా 'బాబు' గారు మాత్రం 'నీకు ఎంతమంది పిల్లలు' అన్న చరణం వదలకుండా ఫిడేల్ వాయించడం మాత్రం  వదిలిపెట్టడం లేదు.

వొక రాజకీయ నాయకుడు అన్నట్లు 'అటు ఇటు కాని పార్టీ తెలుగుదేశం' అన్న మాటలు సరిగ్గా సరిపోతాయి. నోరు తెరిచి ఏమి చెబితే 'పార్టికి' ఏమి నష్టం జరిగిపోతుందో అన్న 'బాబు' భీతి వల్ల  ఈ రోజు రాష్ట్రం రెండు ముక్కలవుతున్నా కూడా నోరు మెదపని 'బాబు' దశ , దిశ చూపే నాయకుడు ఎలా అవుతాడు అని మారుమూల  పల్లె లోని  చిన్న పిల్లవాడు సైతం అంటున్నాడంటే ,  'బాబు' కు గ్రహణం పట్టి మసిబారి పోయినట్లే.

జి ఓ యం చర్చలకు హాజరు కాని 'నారా' ను ఉద్దేశించి కే సి ఆర్ అన్నట్లు 'బాబు కు బ్రెయిన్ వున్నదా దొబ్బిన్దా' అన్న మాటతో అందరు ఏకీభవించాల్సిన సమయం ఇది.

ఏది ఏమైనా రాష్ట్రం సమైక్యంగా ఉండాలనేదే మెజారిటి ప్రజలందరి ఆకాంక్ష.

Sunday, November 10, 2013

ఊపిరి తీసుకుంటున్న సమాధి

ఉదయగిరి దర్గాలోని సమాధి ఊపిరి తీసుకోవడం స్థానిక ప్రజలతోపాటు, రాష్ట్రవ్యాప్తంగా ఆకర్షిస్తోంది. నెల్లూరు జిల్లాలోని దర్గాలోని సమాధి ఊపిరి తీసుకుంటుందనే వార్త బయటకి రావడంతో తండోపతండాలుగా  భక్తులు
నెల్లూరు జిల్లా దర్శించకుంటున్నారు. 
 
ఉదయగిరి సమాధి పగలు మాత్రం మామూలుగానే ఉంటుందని, రాత్రి మాత్రమే ఊపిరి తీసుకోవడం గమనార్హం. ఈ వింతను హిందు, ముస్లీంలకతీతంగా దర్శించుకుంటున్నట్టు తెలుస్తోంది. 
 
ఈ ఘటనను భక్తులు మాత్రం దైవలీల, దేవుడి మహిమ అని భావిస్తుండగా, మరికొంతమంది ఇదంత మూఢనమ్మకమని కొట్టిపారేస్తున్నారు. గతంలో కూడా వినాయకుడు పాలుతాగుతున్నాడని..సాయిబాబా పోటో నుంచి విభూతి రాలుతుందనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

మొదటి పోస్ట్



హాయ్ .. విజయ్ రెడ్డి హియర్ ... ( ప్రస్తుతం దుబాయ్ నుంచి)  (10-11-2013)
"సాక్షి" .. బ్లాగ్ కేవలం ఇన్ఫర్మేషన్ ని  వీలైనంత మందికి చేరవేయాలని స్టార్ట్ చేస్తున్నాను. ఇందులో అభూత కల్పనలు గాని, అధ్బుతమైన కవిత్వం గాని ఏమి వుండదు. ఎక్కువగా 'కరెంట్ ఎఫైర్స్' కి ప్రాధాన్యత వుంటుంది.

మీకు టైం వుంటే చదువుకోండి  :)
ధన్యవాదాలు.

విజయ్ రెడ్డి
[ విజయ్ భాస్కర్ రామిరెడ్డి]